ఆన్లైన్ బోధనను కొనసాగించండి : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్ : ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నప్పటికీ టీచర్లు మాత్రం ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఆర్థిక మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల టీచర్లకు ఆన్లైన్ బోధనా పద్ధతులపై పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఉత్తమ నైపుణ్యం కనబరిచిన టీచర్లకు మంత్రి హరీష్ రావు దృవీకరణ పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. అనేక సేవా కార్యక్రమాలు చేపట్టే లయన్స్ క్లబ్ బోధనా పద్ధతులపై టీచర్లకు పోటీలు నిర్వహించడం అద్భుతమని కొనియాడారు. కరోనా లాక్‌డౌన్‌తో విద్యా రంగంతో పాటు పలు రంగాల్లో అనేక మార్పులు వచ్చాయన్నారు. టీచర్లు ఆన్లైన్లో పాఠాలు బోధించడం ఒక ఛాలెంజ్ అని అన్నారు. విద్యార్థుల భవిష్యత్ తరగతి గదుల్లోనే నిర్మితమవుతోందన్నారు. విద్య అనేది ఉద్యోగం కోసం కాకుండా, నైతిక విలువలు నేర్పేలా ఉండాలన్నారు. సామాజిక స్పృహ కలిగించేలా బోధన ఉండాలని సూచించారు. కొన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక విలువలు నేర్పించడం లేదన్నారు. పదో తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించేలా టీచర్లు కృషి చేయాలని హరీష్ రావు సూచించారు.
తాజావార్తలు
- షార్ట్‌సర్య్కూట్‌తో యూరియా లారీ దగ్ధం
- రైల్వే కార్మికులతో స్నేహభావంగా మెలిగాం : మంత్రి కేటీఆర్
- పీపీఈ కిట్‌లో వచ్చి 13 కోట్ల బంగారం దోచుకెళ్లాడు
- కాబోయే సీఎం కేటీఆర్‌కు కంగ్రాట్స్ : డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- హరిహరన్ మెడలోని డైమండ్ చైన్ మాయం..!
- చరిత్రలో ఈరోజు.. బ్రిటిష్ గవర్నర్‌పై బాంబు విసిరిన దేశభక్తుడతడు..
- ఇంటెలిజెన్స్ అధికారులమంటూ.. తండ్రీకొడుకుల షికారు
- కులవృత్తులకు రూ.వెయ్యి కోట్లతో చేయూత
- సోనుసూద్ పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు
- మేనల్లుడి వివాహాన్ని కన్ఫాం చేసిన వరుణ్ ధావన్ మామ