గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 05, 2020 , 12:25:48

ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీపై మంత్రి హ‌రీష్ రావు ప్ర‌శంస‌లు

ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీపై మంత్రి హ‌రీష్ రావు ప్ర‌శంస‌లు

హైద‌రాబాద్ : ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఓ అంబులెన్స్‌కు దారి చూపించి.. రోగి ప్రాణాలు కాపాడిన హైద‌రాబాద్ ట్రాఫిక్ కానిస్టేబుల్ బాబ్జీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు.. హ్యాట్సాఫ్ బాబ్జీ అంటూ ట్వీట్ చేశారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌ను ఆస్ప‌త్రికి చేర్చిన తీరు అంద‌రికీ ఆద‌ర్శంగా నిలిచిపోతుంద‌న్నారు. పోలీసు డిపార్ట్‌మెంట్ గ‌ర్వంగా ఫీల‌య్యే గొప్ప ప‌ని చేశావు అంటూ బాబ్జీని మంత్రి కొనియాడారు.   

నిత్యం రద్దీగా ఉండే అబిడ్స్‌ జీపీవో ప్రాంతంలో అబిడ్స్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ బాబ్జి సోమవారం విధులు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో ఓ అంబులెన్స్‌ జీపీవో ప్రాంతంలో ట్రాఫిక్‌లో ఇరుక్కు పోయింది. బాబ్జి వెంటనే రంగంలోకి దిగి అంబులెన్స్‌ ముందు పరుగులు పెడుతూ అంబులెన్స్‌ సాఫీగా వెళ్లేలా రోడ్డును క్లియర్‌ చేశాడు. ఈ వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో కానిస్టేబుల్‌ బాబ్జికి  ప్రజల నుంచే కాకుండా పోలీసు ఉన్నతాధికారుల నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా కానిస్టేబుల్‌ బాబ్జీ మాట్లాడుతూ విధుల్లో భాగంగానే తన బాధ్యతగా చేసిన  పనికి ఇంత ఆదరణ రావడం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు.