మానవత్వానికి ప్రతీక లక్ష్మీ.. హరీష్ రావు ప్రశంసలు

సిద్దిపేట : ఆమె మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం.. నిరుపేద అయినప్పటికీ.. గూడు లేని వారికి పెద్ద దిక్కుగా మారింది. నేను నిరుపేదనే.. కానీ ఉండేది ఒక్కదాన్ని.. నాకెందుకు ఇంత పెద్ద ఇల్లు.. నాలాంటి మరో నిరుపేదకు ఆ ఇల్లు ఇవ్వండంటూ గొప్ప మనసుతో ముందుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇల్లును మరొకరికి దానం చేయాలని ఆమె కోరింది. దీంతో ఆమెను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రశంసించారు.
సిద్దిపేట పట్టణానికి చెందిన రచ్చ లక్ష్మీ నిరుపేద మహిళ. ఆమె భర్త కొన్నాళ్ల క్రితం చనిపోయాడు. లక్ష్మీ తన కూతురితో కలిసి ఉంటోంది. నిరుపేదరాలు కావడంతో డబుల్ బెడ్రూం ఇంటికి దరఖాస్తు చేసుకుంది. దీంతో కేసీఆర్ నగర్లో ఆమెకు ఇల్లు మంజూరైంది. ఇటీవలే లక్ష్మీకి ఆ ఇంటి తాళాలు, పట్టా అందజేశారు.
గొప్ప మనసు..
అయితే ఆమె గొప్ప మనసుతో ఆలోచించింది. తన బిడ్డ పెళ్లి అయితే ఉండేది ఒక్కదాన్నే అనుకుంది. ప్రస్తుతం తమ్ముడి ఇంటి వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఒక్కదానికి ఇంత పెద్ద ఇల్లు అవసరమా? అని తనకు తాను ప్రశ్నించుకుంది. తన లాంటి మరో నిరుపేదకు ఆ ఇంటికి ఇచ్చేందుకు లక్ష్మీ ముందుకొచ్చింది. దీంతో మంత్రి హరీష్‌రావుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
హరీష్ రావు ప్రశంసలు
లక్ష్మీ మానవత్వం, నిజాయితీ పట్ల మంత్రి హరీష్ రావు ప్రశంసలు కురిపించారు. లక్ష్మీ లాంటి వారు ఎవరైనా ఉంటే.. ముందుకు రావాలని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి అన్నారు. లక్ష్మీ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హరీష్ రావు స్పష్టం చేశారు. కలెక్టర్‌కు లక్ష్మీ ఆ ఇంటి తాళాలను, పట్టా కాగితాలను అందజేసింది. ఈ సందర్భంగా లక్ష్మీని శాలువాతో కలెక్టర్ సత్కరించి అభినందించారు.
తాజావార్తలు
- చిన్న పరిశ్రమలకు ‘ఆలీబాబా’:డిజైన్‌పై ఫోకస్!
- జలుబు చేసినప్పుడు పెరుగు తింటున్నారా..
- స్ట్రాబెర్రీస్ తినడానికి చాలా కారణాలున్నాయ్.!
- తెలంగాణ సీఐ సృజన్‌రెడ్డికి జీవన్ రక్షా అవార్డు
- రైతన్నలకు శాల్యూట్ : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
- ఆన్ అలైన్ లో అమ్మకానికి బిడ్డ ...!
- బొలెరో వాహనం బోల్తా.. 15 మందికి గాయాలు
- బడ్జెట్ రోజున.. పార్లమెంట్ వైపు దూసుకెళ్తాం: రైతులు
- ఈ మందు టేస్ట్ సూపర్ గురూ..!
- రజినీకాంత్ 'అన్నాత్తే' రిలీజ్ డేట్ ఫిక్స్..!