శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 28, 2020 , 10:04:30

పీవీ నరసింహారావుకు మంత్రి హరీశ్‌రావు ఘన నివాళి

పీవీ నరసింహారావుకు మంత్రి హరీశ్‌రావు ఘన నివాళి

హైదరాబాద్‌ : దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు శతజయంతి నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు పీవీకి ఘన నివాళులర్పించారు. ట్విట్టర్‌ ద్వారా మంత్రి స్పందిస్తూ... తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహారావు. ఆలోచనాపరునిగా, సాహితీవేత్తగా, బహుభాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ ఆమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహనీయుని శతజయంతి ఉత్సవం మొదలైన సందర్భంగా తెలంగాణ ఠీవీ పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం అని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.


logo