బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 01, 2020 , 16:26:43

పనిచేయని కౌన్సిలర్లను తొలగిస్తాం: మంత్రి హరీశ్‌ రావు

పనిచేయని కౌన్సిలర్లను తొలగిస్తాం: మంత్రి హరీశ్‌ రావు

మెదక్‌: నర్సాపూర్‌ పట్టణంలో అన్ని హంగులతో అత్యాధునిక వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌, చేపల మార్కెట్‌తో పాటు రైతు బజార్‌ నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేస్తామని, పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌ రావు తెలిపారు.  ఆదివారం నర్సాపూర్‌ మున్సిపాలిటీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో  ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి, జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డితో కలిసి మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు.  నర్సాపూర్‌ ప్రజల చిరకాల కోరిక అయిన బస్‌డిపో నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకొచ్చేలా తగు చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మను మంత్రి ఫోన్‌లో ఆదేశించారు. నర్సాపూర్‌లో పట్టణంలో అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మహిళ తప్పనిసరిగా తడిపొడి చెత్తను వేరు చేయాలన్నారు. కొత్త మున్సిపల్‌ చట్టం ప్రజలకు అధికారులు, హక్కులు ఇచ్చిందన్నారు. పనిచేయని కౌన్సిలర్లను తొలగిస్తామని మంత్రి హెచ్చరించారు. logo
>>>>>>