శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 29, 2020 , 01:37:03

వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సాగు

వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో సాగు

సంగారెడ్డి: రాష్ట్రంలో రైతులు ఆరుగాలం కష్టపడి చేస్తున్న వ్యవసాయం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం సంగారెడ్డి కలెక్టరేట్‌ ఆడిటోరియంలో 530 మందికి, సదాశివపేటలో 236 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, వీధి వ్యాపారులకు రుణాలు, దళితులకు మొదటి సంవత్సరం పంట పెట్టుబడి సాయం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతాంగానికి ఎకరాకు రూ.5 వేల చొప్పున వానకాలం, యాసంగి పంటలకు రూ.7,400 కోట్ల రైతు బంధు సాయం అందించినట్లు చెప్పారు. వానకాలంలో 1.40 కోట్ల ఎకరాల్లో అన్నదాతలు పంటలు పండించడంలో రికార్డు సాధించడం గొప్ప విషయమన్నారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo