బుధవారం 03 జూన్ 2020
Telangana - Apr 06, 2020 , 10:34:57

ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలి: మంత్రి హరీశ్ రావు

సంగారెడ్డి : రామచంద్రపురంలో మయూరినగర్  లో  కరోన వచ్చిన పరిసరాలను  మంత్రి హరీష్ రావు పరిశీలించారు. మంత్రి వెంట ఎంపీ.కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు,  ఎమ్మెల్యే మహిపల్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మీ ఏరియాలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు రావడం జరిగింది. ఒక కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు వైరస్‌ బాధితులయ్యారు. ఈ ప్రమాదంలో ఏర్పాట్లు, రక్షణ చర్యలను ముమ్మరం చేశాం. స్థానిక ప్రజలకు ఒక విశ్వాసాన్ని, దైర్యాన్ని కల్పించడం కోసం కాలనీలో పర్యటించాం. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి కొడుకుకు కరోనా వచ్చింది కాబట్టి ఇతర కుటుంబ సభ్యులను, ఇంట్లో పనిచేసే పనిమనిషులను క్వారంటైన్‌కు తరలించి వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాం.

కాలనీలో నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా కట్టుదిట్టం చేసి అందరికి వైద్య పరీక్షలు చేయాలని ఆదేశించాం. కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారిని వెంటనే ఐసోలేషన్‌ వార్డుకు తరలించాలని తెలిపాం. ఎవ్వరూ కూడా ప్రభుత్వం ముందు అధరైపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా వ్యాధి లక్షణాలు ఉండే మీ ప్రాంతంలో పర్యటించే వైద్య సిబ్బందికి, లేదా 104 నెంబర్‌కు ఫోన్‌ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మీకోసం ప్రభుత్వం అని రకాలుగా చర్యలు తీసుకుంటుంది. జిల్లాలో రెండు మూడు చోట్ల చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశాం. కూరగాయలు, నిత్యావరస సరుకులు ఇంటి ముంగిటనే అందించే ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఎవరూ బయటకు రాకుండా వ్యాధిని తరిమికొట్టేందుకు సహకరించాలి. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. కరోనా పాజిటివ్‌ తేలిన వారిని కాంటినెంటల్‌ ఆస్పత్రి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. logo