గురువారం 04 జూన్ 2020
Telangana - May 01, 2020 , 10:09:29

కార్మికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం: హరీశ్‌రావు

కార్మికుల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం: హరీశ్‌రావు

హైదరాబాద్‌: కార్మికులు అందిరికీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రపంచ కార్మిక ఐక్యతకు నిదర్శనం మే డే. ప్రతీ దేశం అభివృద్ధి వెనుక కార్మికుల శ్రమ దాగి ఉంది. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణ ప్రాజెక్టుల నిర్మాణంలో కార్మికుల శ్రమను లెక్కించలేమని పేర్కొన్నారు. కార్మికులు రాత్రి, పగలు అని చూడకుండా 24 గంటలు కష్టపడితేనే మూడేండ్లలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయగలిగామని వెల్లడించారు. సిద్ధిపేటలో పారిశుద్ధ్య కార్మికులు మంత్రి సన్మానించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి అల్పాహారం తిన్నారు. 


logo