గురువారం 04 జూన్ 2020
Telangana - May 04, 2020 , 14:44:14

చందలాపూర్‌లో పిల్లకాలువ పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

చందలాపూర్‌లో పిల్లకాలువ పనులు ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట: సిద్దిపేట జిల్లా చందలాపూర్‌లో ప్రధాన ఎడమ కాలువ కింద పిల్ల కాలువ పనులను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం ఉదయం మంత్రి హరీశ్‌ కొబ్బరికాయలు కొట్టి పూజచేశారు. అనంతరం ప్రధాన కాలువ వెంట మంత్రి కలియతిరిగారు. చందలాపూర్‌ ప్రధాన ఎడమకాలువ నుంచి పిల్ల కాలువ తీయడం ద్వారా చిన్న కోడూర్‌, బెల్లంకుంట, పెద్ద చెరువు నిండనున్నదని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఈ సందర్భంగా సిద్దపేట ప్రధాన కాలువలకు గోదావరి జలాలు రావడంతో స్థానిక యువత ఆనందంతో ఈతలు కొడుతుండటాన్ని మంత్రి గమనించారు. ఏం బిడ్డా కాలువల్లో ఈతలు కొడుతున్నారా..? అంటూ వారిని ఆప్యాయంగా పలుకరించారు.     


logo