శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 19:42:52

విశ్వబ్రాహ్మణ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన

విశ్వబ్రాహ్మణ భవన నిర్మాణానికి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన

సిద్దిపేట : రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శనివారం సిద్దిపేట జిల్లాకేంద్రంలో శనివారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణంలోని మూడో వార్డులో రూ.10లక్షల వ్యవయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం మహమ్మాయి దేవాలయ ఆవరణలో రూ.30 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న విశ్వ బ్రాహ్మణ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మూడో వార్డు కౌన్సిలర్ గుడాల శ్రీకాంత్ సంధ్య నివాసంలో నిరుపేదలకు కుట్టు మిషన్లను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాల సాయిరామ్‌, వార్డు కౌన్సిలర్లు ధర్మవరం స్వప్నబ్రహ్మం, గుడాల సంధ్యశ్రీకాంత్‌, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.