గురువారం 01 అక్టోబర్ 2020
Telangana - Aug 25, 2020 , 12:14:34

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. సిద్దిపేట పట్టణంలోని బారాయిమామ్ చిన్నమసీదు సమీపంలో మంగళవారం రూ.25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలీ సమాజ భవన నిర్మాణ పనులకు  శంకుస్థాపన చేశారు. 

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలీ సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు. అలాగే మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ప్రాథమిక పాఠశాల, అంగన్ వాడీ కేంద్రానికి, గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్రామంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు ప్రారంభోత్సవం చేశారు.

తాజావార్తలు


logo