మంగళవారం 19 జనవరి 2021
Telangana - Jan 06, 2021 , 12:49:11

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా 'డ‌బుల్' ఇండ్ల ఎంపిక‌

అత్యంత పార‌ద‌ర్శ‌కంగా 'డ‌బుల్' ఇండ్ల ఎంపిక‌

సిద్దిపేట : సిద్దిపేట పట్టణం కేసీఆర్ నగర్‌కు చెందిన 216 మంది ల‌బ్దిదారుల‌కు ఏడో విడ‌త‌లో భాగంగా డ‌బుల్ బెడ్రూం ఇండ్ల పట్టాల‌ను రాష్ర్ట ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక అత్యంత పార‌ద‌ర్శ‌కంగా, నిష్ప‌క్ష‌పాతంగా జ‌రిగింద‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్‌లోని గెటేడ్ కమ్యూనిటీ త‌ర‌హాలో స‌క‌ల సౌక‌ర్యాల‌తో ఇండ్లు నిర్మించి ఇచ్చామ‌ని తెలిపారు. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ ఇండ్ల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. చెత్త ఎక్క‌డ ప‌డితే అక్క‌డ వేయొద్ద‌న్నారు. దోమ‌ల బెడ‌ద‌, ఈగ‌లు లేకుండా అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్య‌వ‌స్థ‌ను నిర్మించామ‌ని గుర్తు చేశారు. ఈ ఇండ్ల నిర్మాణానికి రెండున్న‌ర సంవ‌త్స‌రాలు క‌ష్ట‌ప‌డ్డామ‌ని తెలిపారు. నిర్మాణం జ‌రుగుతున్న స‌మ‌యంలో సుమారు 400 సార్లు ఈ ప్రాంతానికి వ‌చ్చాన‌ని మంత్రి తెలిపారు. ప్ర‌భుత్వం ఇచ్చిన ఇండ్ల‌ను అమ్మినా, కిరాయికి ఇచ్చినా కేసులు న‌మోదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు. మిగిలిన అర్హులైన వాంద‌రికీ ఇండ్లు క‌ట్టిస్తామ‌ని మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు.