మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 30, 2020 , 12:22:44

వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

వర్గల్ లో ఆర్టీసీ బస్టాండ్ ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన, ప్రాణాలను కాపాడుకోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.  జిల్లాలోని వర్గల్ మండల కేంద్రం గ్రామ పంచాయతీ ఆవరణలో.. గడా నిధులు రూ.50 లక్షలతో నూతనంగా నిర్మించిన  టీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుశిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా రవాణా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. 
logo