శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:50:38

సిద్దిపేటలో వంద పడకల కొవిడ్‌ హాస్పిటల్‌.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేటలో వంద పడకల కొవిడ్‌ హాస్పిటల్‌.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట : జిల్లాకేంద్రంలో వంద పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్‌-19 దవాఖానను రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు బుధవారం ప్రారంభించారు. అనంతరం మంత్రి ఐసోలేషన్ వార్డులను పరిశీలించారు. రోగులకు అందించాల్సిన వైద్యంపై వైద్యులతో కాసేపు చర్చించారు. కరోనా వైరస్‌ సోకి దవాఖానకు వచ్చిన రోగులకు, వైద్యుల కోసం సిద్ధంగా ఉంచిన ఎనర్జీ డ్రింక్స్‌, అవి వాడే విధానం, వేడి తాగునీరు అందించడంపై తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. దవాఖానలో 80 పడకలతో పాటు 20 ఐసీయూ బెడ్లు ఉన్నాయి. కార్యాక్రమంలో జడ్పీ చైర్మన్ వేలేటి రోజారాధాకృష్ణ శర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ తమిళ్ అరసు, వైద్య అధికారులు, డాక్టర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


logo