శనివారం 11 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 10:43:36

కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్‌ బీమా అందజేత

కార్యకర్త కుటుంబానికి మంత్రి హరీశ్‌ బీమా అందజేత

మెదక్‌ : టీఆర్‌ఎస్‌ పార్టీలోని ప్రతి కార్యకర్తకు, కుటుంబానికి అండగా ఉంటామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం అనంతసాగర్‌ గ్రామానికి చెందిన పోతరాజు అఖిల్‌ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడు. టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వం ఉండటంతో మృతుడికి ప్రమాద బీమా వర్తించింది. ఇందుకు సంబంధించి రూ. 2 లక్షల చెక్కును మంత్రి హరీశ్‌ నేడు మృతుడు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పార్టీ అధ్యక్షులు, సీఎం కేసీఆర్‌ పార్టీలో పనిచేసే ప్రతి కార్యకర్త కుటుంబానికి అండగా ఉండేందుకే ప్రమాద బీమా కల్పించినట్లు తెలిపారు. ఇప్పటివరకు సిద్దిపేట నియోజకవర్గంలో 18 మంది కార్యకర్తల కుటుంబాలకు ప్రమాద బీమా చెక్కులను అందించినట్లు పేర్కొన్నారు.


logo