శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 02:35:03

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం

రైతు సంక్షేమమే సర్కార్‌ లక్ష్యం

దుబ్బాక: గతంలో భూమి ఉంటే రైతులు సర్కారుకు శిస్తు (రకం) కట్టేవారని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రైతుకే డబ్బులు ఇస్తున్నదని ఆర్థిక శాఖ మంత్ర తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎకరానికి రూ.10 వేలు పంట పెట్టుబడి సాయం అందిస్తున్నదని తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని రెడ్డి సంఘంలో మంగళవారం ఉదయం  కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో రైతుబంధు పథకం ఎందుకు అమలు చేస్తలేరని ప్రశ్నించారు. 70 ఏండ్లు కాంగ్రెస్‌, టీడీపీ ప్రభుత్వాలు చేయలేని అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. కేవలం మూడేండ్లలో సీఎం కేసీఆర్‌ చేసి చూపించారన్నారు. 


logo