గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 10:12:01

ఏ నైతిక‌త‌తో ఓట్లు అడుగుతున్నారు: మ‌ంత్రి హ‌రీశ్ రావు

ఏ నైతిక‌త‌తో ఓట్లు అడుగుతున్నారు: మ‌ంత్రి హ‌రీశ్ రావు

సిద్దిపేట‌: ‌కేంద్రంలో అధికారంలో ఉన్న‌ బీజేపీ తెలంగాణ‌కు అడుగ‌డుగునా అన్యాయం చేసింద‌ని మంత్రి హ‌రీశ్ రావు ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎన్నిక‌ల్లో పోటీచేసే హ‌క్కు ప్ర‌తిఒక్క‌రికి ఉంటుంద‌ని, మీరు ఏ నైతిక‌త‌తో ఓట్లు అడుగుతున్నార‌ని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ బండి సంజ‌య్‌ని మంత్రి  ప్ర‌శ్నించారు. ఈమేర‌కు ప‌లు అంశాల‌తో బ‌హిరంగ లేఖ రాశారు. బీజేపీ బ‌హిష్కృత నేత తోట క‌మ‌లాక‌ర్ రెడ్డి ఇవాళ మంత్రి స‌మ‌క్షంలో టీఆర్ఎస్‌లో చేశారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పౌరుడిగా సంజ‌య్‌కు బ‌హిరంగలేఖ రాస్తున్నాన‌ని, ‌దానికి ఆయ‌న స్పందిస్తార‌ని ఆశిస్తున్నాని చెప్పారు. పింఛ‌న్ల‌పై స‌వాల్ చేస్తే ఇంత‌వ‌రకు స్పందించ‌లేద‌ని చెప్పారు. బీజేపీ నేత‌లు వ్య‌క్తిగ‌త ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. 

14 అంశాల‌తో చార్జిషీట్ వేస్తే ఇప్ప‌టివ‌ర‌కు స‌మాధానం ఇవ్వ‌లేద‌న్నారు. తెలంగాణ రాగానే 7 మండ‌లాల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు అప్ప‌గించార‌ని విమ‌ర్శించారు. లోయ‌ర్ సీలేరు విద్యుదుత్ప‌త్తి కేంద్రాన్ని ఏపీకి అప్ప‌గించింది, కాజీపేట వ్యాగ‌న్ ఫ్యాక్ట‌రీని ర‌ద్దు చేసింది బీజేపీ కాదా అని ప్ర‌శ్నించారు. ‌బ‌య్యారంలో ఉక్కుప‌రిశ్ర‌మ పెట్ట‌కుండా కేంద్రం మోసం చేస్తున్న‌ద‌ని, నీటి పంప‌కాలు చేయ‌కుండా అన్యాయం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. 

యూపీఏ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును ఎందుకు వెన‌క్కి తీసుకున్నార‌ని, తెలంగాణ‌లో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఎందుకు ఇవ్వ‌లేద‌ని ప్ర‌శ్నించారు. మిష‌న్ భ‌గీర‌థ‌, మిష‌న్ కాక‌తీయ‌కు రూ.24 వేల కోట్ల‌ నిధులు ఇవ్వాల‌ని నీతి ఆయోగ్ సిఫార్సు చేసింద‌ని, అయినా 24 పైస‌లు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. ఆదిలాబాద్‌లో బీజేపీ గెలిపిస్తే సీసీఐని తిరిగి తెరుస్తామ‌న్నార‌ని, గెలిచి రెండేండ్ల‌యినా ఎందుకు తీసుకురాలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. ఎస్పీ వ‌ర్గీక‌ర‌ణ‌పై అసెంబ్లీలో తీర్మానం చేసినా ఎందుకు పట్టించుకోవ‌డంలేద‌ని హ‌రిశ్ విమ‌ర్శించారు.