బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 17, 2020 , 13:46:16

రైతుల‌ను ఇబ్బంది పెడుతున్న‌ది కాంగ్రెస్, బీజేపీనే : మ‌ంత్రి హ‌రీష్ రావు

రైతుల‌ను ఇబ్బంది పెడుతున్న‌ది కాంగ్రెస్, బీజేపీనే : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : గ‌తంలో రైతుల‌కు నాణ్య‌మైన క‌రెంట్ ఇవ్వ‌కుండా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడితే.. ఇప్పుడేమో బావుల వ‌ద్ద మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టి బీజేపీ ఇబ్బంది పెడుతుంద‌ని ఆర్థిక మంత్రి హ‌రీష్ రావు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక‌ల్లో భాగంగా దౌల్తాబాద్ మండ‌లంలోని ముబార‌స్‌పూర్‌లో నిర్వ‌హించిన ఎన్నిక‌ల ప్ర‌చారంలో హ‌రీష్ రావు పాల్గొని ప్ర‌సంగించారు.

దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గ తొలి మ‌హిళ ఎమ్మెల్యే సోలిపేట సుజాత‌నే.. ఇందులో ఎలాంటి అనుమానం అవ‌స‌రం లేద‌న్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో బీడీ కార్మికుల‌కు పెన్ష‌న్లు ఇవ్వ‌డం లేదు.  కాంగ్రెస్, టీడీపీ ప్ర‌భుత్వాలు.. క‌నీసం తాగునీటి స‌మ‌స్య‌ను కూడా తీర్చ‌లేదు అని మంత్రి గుర్తు చేశారు. క‌రోనా క‌ష్ట‌కాలంలో కూడా ప్ర‌భుత్వం సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింద‌ని తెలిపారు. వానాకాలంలో ఉసిల్లు వ‌చ్చిన‌ట్లు.. ఎన్నిక‌ల స‌మ‌యంలోనే కాంగ్రెస్, బీజేపీ నాయ‌కులు వ‌చ్చిపోతారు అని హ‌రీష్ రావు విమ‌ర్శించారు. ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండి సేవ చేసేది కేవ‌లం టీఆర్ఎస్ పార్టీ మాత్ర‌మే అని స్ప‌ష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ఎండ‌మావులు వంటివే.. వాటి వెంట‌పోతే ఏమీ రాదు అని హ‌రీష్ రావు తేల్చిచెప్పారు. logo