బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 14:45:15

దేవీప్రియ‌ కుటుంబానికి మంత్రి హరీశ్‌ ప్రగాఢ సానుభూతి

దేవీప్రియ‌ కుటుంబానికి మంత్రి హరీశ్‌ ప్రగాఢ సానుభూతి

హైదరాబాద్‌ : ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ దేవీప్రియ‌ మృతి పట్ల రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రగాఢ సానుభూతి తెలిపారు. దేవీప్రియ మృతి సాహితీ రంగానికి తీరని లోటన్నారు. మెతుకు సీమతో ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో మంజీర రచయితల సంఘం ఆధ్వర్యంలో జరిగిన పలు సభల్లో పాల్గొని సామాజిక చైతన్యం కోసం ఎంతో కృషి చేశారన్నారు. 

దేవీప్రియ‌ గ‌త కొంతకాలంగా మధుమేహంతో బాధపడుతున్నారు. చికిత్స నిమిత్తం ఈ నెల 6న న‌గ‌రంలోని ఓ ద‌వాఖాన‌లో చేరారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఇవాళ ఉదయం 7.10 గంటలకు తుదిశ్వాస విడిచారు. సాహితీ లోకంలో దేవీప్రియగా గుర్తింపు పొందిన ఆయ‌న‌ అస‌లు పేరు షేక్‌ ఖాజా హుస్సేన్.