శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
Telangana - Jul 23, 2020 , 16:08:06

‘నారింజను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు’

 ‘నారింజను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు’

సంగారెడ్డి :  జిల్లాలోని జహీరాబాద్ మండలం కొత్తూరు లోని నారింజ ప్రాజెక్ట్ ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్న వాటిని మరమ్మతులు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ సాగులో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడుతూ రైతన్నల ఆర్థికాభివృద్ధికి పాటుపడుతున్నారని తెలిపారు. నారింజ  ప్రాజెక్ట్ మరమ్మతుల కోసం నిధులు కూడా మంజూరు చేశామని గుర్తు చేశారు. మంత్రి వెంట జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే మాణిక్యరావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ఉన్నారు.logo