సోమవారం 13 జూలై 2020
Telangana - May 27, 2020 , 01:26:05

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

కొండపోచమ్మ రిజర్వాయర్‌ను ఈ నెల 29న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించనున్న నేపథ్యంలో మంత్రి హరీశ్‌రావు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం కేసీఆర్‌తోపాటు 200 మంది వీవీఐపీ, వెయ్యిమంది వీఐపీ, మీడియాకు బ్లాకులవారీగా భోజన సదుపాయాలు ఏర్పాటుచేయాలని అధికారులకు సూచించారు. బందోబస్తు, వాహనాల పార్కింగ్‌సదుపాయలపై సీపీతో చర్చించారు. కొండ పోచమ్మ రిజర్వాయర్‌పై కట్టను, పాములపర్తి గ్రామంలో హెలిప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. మంత్రి వెంట కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి, సీపీ జోయల్‌ డేవీస్‌, ఈఎన్సీ హరిరామ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్‌ఈ వేణు తదితరులు ఉన్నారు. అంతకుముందు మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలోని కలెక్టరేట్‌లో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 


logo