శుక్రవారం 04 డిసెంబర్ 2020
Telangana - Oct 31, 2020 , 10:50:31

ఆ నాయ‌కుల‌కు గుండెల్లో గుబులు : మ‌ంత్రి హ‌రీష్ రావు

ఆ నాయ‌కుల‌కు గుండెల్లో గుబులు : మ‌ంత్రి హ‌రీష్ రావు

సిద్దిపేట : దుబ్బాక ఉప ఎన్నిక‌లో భాగంగా రాయ‌పోల్ మండ‌లం ఎల్క‌ల్‌, బేగంపేట గ్రామాల్లో మంత్రి హ‌రీష్ రావు శ‌నివారం ఉద‌యం ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ..  స్వ‌ర్గీయ రామ‌లింగారెడ్డి మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. టీఆర్ఎస్ పార్టీకి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌ను చూసి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయ‌కుల‌కు గుండెల్లో గుబులు పుట్టింద‌న్నారు. ఈ ఎన్నిక‌లో ఆ రెండు పార్టీల‌కు డిపాజిట్లు గ‌ల్లంతు కావ‌డం ఖాయ‌మ‌న్నారు. రాయ‌పోల్‌ను మండ‌ల కేంద్రం చేసిన కేసీఆర్‌కే ద‌క్కుతుంద‌న్నారు. ఎల్క‌ల్‌, బేగంపేట గ్రామాల‌ను అభివృద్ధి చేస్తామ‌న్నారు.

నవంబ‌ర్ 3వ తేదీన సోలిపేట సుజాత రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాల‌ని ప్ర‌జ‌ల‌కు మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. బావుల వ‌ద్ద మీట‌ర్లు బిగించే బీజేపీకి ఓటేసే ముందు ఒక్క‌సారి ఆలోచించాల‌ని సూచించారు. ఆ రెండు పార్టీలు దుబ్బాక‌కు చేసిందేమీ లేద‌న్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఈ నియోజ‌క‌వ‌ర్గాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తామ‌ని హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. రాష్ర్టంలో సంక్షేమ ప‌థ‌కాలు బ్ర‌హ్మాండంగా అమ‌ల‌వుతున్నాయ‌ని తెలిపారు. రైతుల‌కు ఉచితంగా 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్‌ను ఇస్తున్నాం. పేదింటి ఆడ‌బిడ్డ‌ల‌కు క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ ప‌థ‌కం ద్వారా ఆర్థిక సాయం అంద‌జేస్తున్నాం. బీడీ కార్మికుల‌కు ఆసరా పెన్ష‌న్లు ఇస్తున్నామ‌ని మంత్రి హ‌రీష్ రావు తెలిపారు.