బుధవారం 25 నవంబర్ 2020
Telangana - Oct 21, 2020 , 21:54:17

స‌వాల్ విసిరితే ప‌త్తా లేకుండా పోయారు : హ‌రీశ్‌

స‌వాల్ విసిరితే ప‌త్తా లేకుండా పోయారు : హ‌రీశ్‌

సిద్దిపేట : దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారంలో భాగంగా మిరుదొడ్డి మండలం అల్వాలలో మంత్రి హరీష్ రావు బుధ‌వారం సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అల్వాల ప్రజల అపూర్వ స్వాగతం ఎప్పుడు మరవ‌మ‌న్నారు. రైతు పక్షనా నిలిచే ప్రభుత్వం టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అన్నారు. పింఛన్లు తామే ఇస్తున్నం అని ప్రగల్భాలు పలికిన బీజేపీకి రండి తేల్చుకుందాం అని సవాల్ విసిరితే ప‌త్తా లేకుండా పోయార‌న్నారు. బాయికాడ మీటర్లు బీజేపీ, కాలిపోయే మోటర్లు కాంగ్రెస్ పార్టీదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రూ. 30 వేలు కడితే కానీ ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ ఇచ్చే వాళ్ళు కాద‌న్నారు.

దుబ్బాక నియోజకవర్గంలో 1500 ట్రాన్స్‌ఫార్మ‌ర్లు, 6 వేల విద్యుత్ పోల్స్, 18 విద్యుత్ సబ్ స్టేషన్లు ఏర్పాటు చేసి కరెంట్ కష్టాలు తీర్చిండు మన రాంలింగన్న. మీటర్లు కావాలి అంటే పువ్వు గుర్తుకు కరెంట్ కష్టాలు కావాలంటే కాంగ్రెస్‌కు ఇవ్వన్ని వద్దు ప్ర‌జ‌ల సంక్షేమం కోరే టీఆర్ఎస్ కావాలంటే కారు గుర్తుకు ఓటేయాల‌న్నారు. అల్వాల్ గ్రామ అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌ పార్టీ ప్రభుత్వంతోనే సాధ్య‌మ‌న్నారు. గ్రామాల అభివృద్ధికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామ‌న్నారు. పేదల సంక్షేమం, దుబ్బాక అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్ కారు గుర్తుకు ఓటేసి సుజాతక్కను గెలిపించాల్సిందిగా కోరారు.