గురువారం 28 మే 2020
Telangana - May 22, 2020 , 18:40:20

పేద ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసర సరుకుల పంపిణీ

పేద ముస్లింలకు మంత్రి హరీశ్‌రావు నిత్యావసర సరుకుల పంపిణీ

సిద్దిపేట : గజ్వేల్‌ పట్టణంలో విష్ణు జగతి సౌజన్యంతో సమీకృత భవన సముదాయ కార్యాలయంలో నేడు పేద ముస్లింలకు రంజాన్‌ పండుగ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ... సహృదయంతో సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన విష్ణు జగతి వారిని అభినందించారు. సీఎం కేసీఆర్‌ నిరంతరం ప్రజల సంక్షేమం పరమావదిగా భావిస్తూ ఆలోచన చేస్తున్నారని అన్నారు. అల్లా దయతో కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతా చర్యలు తీసుకుంటూ భౌతికదూరం పాటించాలన్నారు. శానిటైజర్లతో చేతులు తరచుగా శుభ్రం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌ ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, డాక్టర్‌ యాదవ రెడ్డి, గడ ఆఫీసర్‌ ముత్యంరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రాజమౌళి, వైస్‌ చైర్మన్‌ జఖీ, మాదాసు శ్రీనివాస్‌, బెండే మధు, యాదగిరి, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.logo