గురువారం 04 జూన్ 2020
Telangana - May 09, 2020 , 01:59:09

గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్‌ అభినందనలు

గాంధీ వైద్యులకు మంత్రి హరీశ్‌ అభినందనలు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా బాధితురాలికి సురక్షితంగా ప్రసవంచేసిన గాంధీ దవాఖాన వైద్యులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అభినందించారు. శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా వైద్యులను ప్రశంసించారు. కరోనా బారినపడిన నిండు చూలాలిలో ధైర్యం నింపి పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ దవాఖాన వైద్యులు దేశానికి ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఇంటికి చేరాలని కోరుకుంటున్నానని ట్వీట్‌ చేశారు.logo