సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 11, 2020 , 21:02:18

అధికారులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

అధికారులను అభినందించిన మంత్రి హరీశ్‌రావు

సంగారెడ్డి : జిల్లాలో అన్ని పంచాయతీల్లో డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తి చేసేందుకు కృషి చేసిన కలెక్టర్ ను, అధికారులను,  ప్రజా ప్రతినిధులను ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌ రావు అభినందించారు. శనివారం సాయంత్రం కలెక్టర్ చాంబర్ నుంచి ప్రజా ప్రతినిధులు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలోని 647 పంచాయతీల్లో డంపింగ్‌ యార్డుల నిర్మాణం పూర్తయ్యిందని తెలిపారు. తడి పొడి చెత్తను వేరువేరుగా సేకరించాలన్నారు. నిర్మించిన డంపింగ్‌ యార్డులను వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ఇదే  స్ఫూర్తితో గ్రామగ్రామాన వైకుంఠధామాలు, రైతు వేదికల నిర్మాణం పూర్తిచేయాలని సూచించారు. డంపింగ్ యార్డులను వినియోగంలోకి తేవడంతోపాటు వర్మీ కంపోస్టు తయారు చేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టెలీ కాన్ఫరెన్స్లో ఆందోల్ శాసనసభ్యుడు క్రాంతి కిరణ్ కలెక్టర్ హనుమంతరావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo