శనివారం 23 జనవరి 2021
Telangana - Dec 01, 2020 , 08:35:18

జీవితాంతం ప్రజల హక్కులకోసం పోరాడిన నోముల: హరీష్‌ రావు

జీవితాంతం ప్రజల హక్కులకోసం పోరాడిన నోముల: హరీష్‌ రావు

హైదరాబాద్‌: సీనియర్‌ నేత, నాగార్జునసాగర్‌ శాసనసభ్యులు నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిపట్ల మంత్రి హరీష్‌ రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అకాల మరణం దురదృష్టకరమన్నారు. జీవితాంతం ప్రజలకోసం, వారి హక్కుల కోసం పోరాడారన్నారు. తాను నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నిబద్ధతగా పనిచేశారని వెల్లడించారు. నోముల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతిపట్ల మంత్రి జగదీష్ రెడ్డి దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మరణం ఉమ్మడి నల్లగొండ జిల్లాకు తీరనిలోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మెల్యే నోముల మృతిపట్ల మంత్రి సత్యవతి రాథోడ్‌ సంతాపం తెలిపారు.  రాజకీయాల్లో సుదీర్ఘకాలంపాటు కొనసాగి, ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అలుపెరుగని పోరాటం చేశారని, సామాన్యుని గొంతుగా పనిచేశారని, తను అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం పాటుపడిన వ్యక్తి  అని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. సీనియర్‌నేత, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణం తీవ్ర దురదృష్టకమని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.  


logo