మంగళవారం 31 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 14:06:43

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా...

ఆరోగ్య తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా...

హైదరాబాద్‌: ఆరోగ్య తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం ప్రజా వైద్యరంగాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కేసీఆర్‌ కిట్‌ పథకం అద్భుత ఫలితాలు సాధించింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య 22 శాతం పెరిగింది. 40 ప్రభుత్వాసుపత్రుల్లో డయాలసీస్‌ కేంద్రాలను, 20 ఐసీయూ కేంద్రాను ఏర్పాటు చేసుకున్నాం. ప్రజా వైద్యంపై నమ్మకం పెరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో ఇన్‌పేషంట్ల సంఖ్య 20శాతం పెరిగింది. రాష్ట్రంలో గతంలో కేవలం ఐదు మెడికల్‌ కాలేజీలు మాత్రమే ఉండేవి. ప్రభుత్వం కొత్తగా 4 మెడికల్‌ కాలేజీలు ప్రారంభించింది. హైదరాబాద్‌ నగరంలో 118 బస్తీ దవాఖానాలు పేదలకు వైద్య సేవలు అందిస్తున్నాయి.

బస్తీ దవాఖాల సంఖ్యను 350కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు నడుస్తున్న వాటితో పాటు మరో 232 బస్తీ దవాఖానాలను త్వరలోనే ప్రారంభించుకుంటున్నాం. ప్రతీ డివిజన్‌లో కనీసం రెండు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడంతో పాటు పేదలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో అదనంగా బస్తీ దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో కంటి వెలుగు ద్వారా కోటి 54 లక్షల మందికి ఉచితంగా కంటి పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచితంగా మందులు, అద్దాలు పంపిణీ చేసుకున్నాం. కంటి వెలుగు తరహాలోనే చెవి, ముక్కు, గొంతు, దంత సంబంధింత వ్యాధుల నిర్ధారణ కోసం ప్రత్యేక కార్యచరణను త్వరలోనే ప్రారంభించుకుంటున్నాం. తెలంగాణలోని ప్రతి పౌరుడి హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్‌లో వైద్య రంగానికి రూ.6,186 కోట్లు కేటాయించడం జరిగింది. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ప్రబలకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని తెలిపారు. 


logo
>>>>>>