బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 13:17:06

ఈ ఏడాది నుంచే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌...

ఈ ఏడాది నుంచే 57 ఏళ్లు నిండిన వారికి పెన్షన్‌...

హైదరాబాద్‌: ఈ ఆర్థిక సంవత్సరం నుంచే 57 ఏండ్లు నిండిన వారికి ప్రభుత్వం వృద్దాప్య పెన్షన్‌ అందించబోతుందని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. 40 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు పేదలకు జీవన భద్రతను,భవిష్యత్తుపై భరోసాను కల్పిస్తున్నాయి. దేశంలోనే సంక్షేమరంగానికి అత్యధిక నిధులు కేటాయించిన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో రూ. 1000 పెన్షన్‌ ఇచ్చుకున్నాం. గత ఆర్థిక సంవత్సరం నుంచి దానికి వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలు, ఎయిడ్స్‌ వ్యాధి బాధితులు, గీతకార్మికులకు రూ.2,016 పెన్షన్‌ ఇచ్చుకుంటున్నాం. వికలాంగుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016 కు పెంచుకున్నాం. పెన్షన్‌ వయస్సు 57 ఏండ్లకు తగ్గించడం వల్ల రాష్ట్రంలో ఆసరా పెన్షన్ల లబ్దిదారుల సంఖ్య ప్రస్తుతం ఉన్న 39,41,976 నుంచి మరింత పెరగనుంది. గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో పెన్షన్లకు రూ.9,402 కోట్లు కేటాయించాం. ఈ బడ్జెట్‌లో 11,758 కోట్లు ప్రతిపాదించినట్లు వెల్లడించారు. 


logo
>>>>>>