సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:53:51

పంటల మద్దతు ధరకు చర్యలు...

పంటల మద్దతు ధరకు చర్యలు...

హైదరాబాద్‌:  రైతులు పండించిన పంటలకు మద్దతు ధర లభించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న, కందులు తదితర పంటల కొనుగోలుకు పెద్ద ఎత్తన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు సరైన ధర వచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కందులను కేంద్ర ప్రభుత్వం కొద్దిశాతం మాత్రమే కొనుగోలు చేసింది. కంది రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతో మొత్తం కందులు రాష్ట్ర ప్రభుత్వం కొనాలని నిర్ణయించింది. మార్కెట్‌ ఇంటర్వేన్షన్‌ ఫండ్‌ కోసం రూ.1000 కోట్లు ఈ బడ్జెట్‌లో ప్రతిపాదించామని తెలిపారు.

పండ్లు, కూరగాయల సాగులో అవసరమైన పరిజ్ఞానాన్ని, పరిశోధనను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గం ములుగులో కొండా లక్ష్మణ్‌ బాపూజీ పేరిట హార్టికల్చర్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. జీడిమెట్ల, ములుగులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌ లెన్సును ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు రైతులకు కావాల్సిన నాణ్యమైన నారు, రైతులకు కావాల్సిన శిక్షణ అందిస్తాయని తెలిపారు. రైతులు పరస్పరం చర్చించుకునేందుకు రైతు సమన్వయ సమితుల పేరును రైతు బంధు సమితులుగా ప్రభుత్వ నిర్ణయించింది. 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ ఐదువేల ఎకరాల క్లస్టర్‌కు ఒకటి చొప్పున రైతు వేదికలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో రైతు వేదికను రూ.12 లక్షల వ్యయంతో నిర్మించాలని తలపెట్టింది. రైతు వేదికల నిర్మాణం కోసం ఈ బడ్జెట్‌లో 350 కోట్ల రూపాయలు ప్రతిపాదించినట్లు తెలిపారు. పాడి రైతులను ప్రోత్సహించేందుకు ఈ సారి బడ్జెట్‌లో రూ.100 కోట్లు ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.


logo