శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:42:25

సకాలంలో ఎరువులు... విత్తనాలు..

సకాలంలో ఎరువులు... విత్తనాలు..

ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించి, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. శాసనసభలో బడ్జెట్‌ ప్రసంగం చదువుతూ... ప్రతీ ఏటా ఎండాకాలంలోనే ఎరువులు విత్తనాలు తెప్పించి గోదాముల్లో నిలువ చేస్తున్నాం. ఇందుకోసం గోదాముల నిల్వ సామర్థ్యాన్ని పెద్ద ఎత్తున పెంచుకున్నాం. రాష్ట్రం ఏర్పడినప్పుడు గోదాముల నిల్వ సామర్థ్యం 4.17 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండగా, ఈ రోజు 22.47 లక్షల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములను అందుబాటులోకి తెచ్చుకున్నాం. సకాలంలో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుతుండటంతో రైతులు సకాలంలో వ్యవసాయ పనులు ప్రారంభించగలుగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు 2013-14లో విత్తనాల సబ్సిడీ కోసం మొత్తం రూ.76 కోట్ల 71 లక్షలు మాత్రమే ఖర్చు చేశారు. 2019-20 సంవత్సరంలో అంతకు రెట్టింపుగా 142 కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విత్తనాల సబ్సిడీకి అందజేసిందని తెలిపారు. 


logo