శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:43:12

వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో గొప్ప మార్పు...

వ్యవసాయ, దాని అనుబంధ రంగాల్లో గొప్ప మార్పు...

హైదరాబాద్‌ : వ్యవసాయం దాని అనుబంధ రంగాల పునరుత్తేజానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్పలితాలనిస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ...  గత ఆర్థిక సంవత్సరం వ్యవసాయం దాని అనుబంధ రంగాల్లో నమోదైన గణాంకాల్లో స్పష్టంగా అభివృద్ధి కనిపిస్తోంది. రాష్ట్ర పంటల ఉత్పత్తిలో 23.7శాతం, పాడి పశువుల రంగంలో 17.3 శాతం, చేపల పెంపకంలో 8.1 శాతం వృద్ధిని సాధించాం. రైతు బంధు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం, గొర్రెలు, బర్రెల పంపిణీ, చెరువుల్లో చేపల పెంపకం వంటి పథకాలు రైతు సంక్షేమానికి, రాష్ట్ర ఆర్థిక రంగ అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. సేవారంగంలో 2019-20లో 14.1శాతం వృద్ధిరేటు నమోదైందన్నారు. 


logo