శుక్రవారం 10 ఏప్రిల్ 2020
Telangana - Mar 08, 2020 , 12:43:30

కేంద్రం నుంచి నిధులు తగ్గినా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం..

కేంద్రం నుంచి నిధులు తగ్గినా సంక్షేమాన్ని కొనసాగిస్తున్నాం..

హైదరాబాద్‌:  రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు శాసన సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి బడ్జెట్‌ను చదువుతూ... భారత దేశ చరిత్రలో తెలంగాణ ఉద్యమం నూతన అధ్యయనం సృష్టించింది. అహింసా మార్గంలో శాంతియుత పంథాలో సాగిన ఉద్యమం ఫలించి తెలంగాణ రాష్ట్రం అవతరించింది. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం ప్రగతిశీల రాష్ట్రంగా రూపుదిద్దుకుంటుంది. అన్ని రంగాల సంక్షేమం, అన్ని రంగాల అభివృద్దే లక్ష్యంగా పూర్తి వాస్తవిక దృక్పదాలతో 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను రూపొందించడం జరిగింది. 


భారత దేశ ఆర్థిక వృద్ధిరేటు గత ఆర్థిక సంవత్సరం నుంచి తగ్గతూ వస్తున్నది. దీనివల్ల కేంద్ర ఆదాయ వనరులు తగ్గడంతో రాష్ర్టాలకు వచ్చే పన్నుల వాటాలోనూ గ్రాంట్లలోనూ కోతపడింది. ఆర్థిక మాధ్య ప్రభావం, రాష్ట్ర పన్నులు, పన్నేతర ఆదాయంపై పడింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన పన్నుల వాటా బడ్జెట్‌లో వేసుకున్న  అంచనాల కంటే 3731 కోట్ల రూపాయలు తగ్గింది. రాష్ర్టానికి రావాల్సిన ఐజీఎస్టీ, జీఎస్టీ నిధులు సకాలంలో రావడం లేదు. వచ్చే నిధులు అరకొరగా కేంద్రం విడుదల చేస్తుంది. రాష్ట్ర రెవెన్యూ వృద్ధిరేటు 2018-19 సంవత్సరంలో 16.1శాతం ఉంటే ఆర్థిక మాధ్యం కారణంగా 2019-20 ఫిబ్రవరి చివరి నాటికి 6.3 శాతానికి తగ్గింది.


 15వ ఆర్తిక సంఘం పన్నుల వాటాలో 2.437 శాతం నుంచి 2.133 శాతానికి తగ్గింది. రాష్ర్టానికి రావాల్సిన నిధుల్లో 2,384 కోట్ల రూపాయలు తగ్గుతాయి. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో, సరైన వ్యూహాలను రూపొందించి, అభివద్ధి దిశలో పురోగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం చేస్తుంది. కేంద్రం నుంచి వచ్చే పన్నులు, గ్రాంట్లలో కోత పడినప్పటికి ఆ లోటు రాష్ట్ర ఆదాయ వృద్ధితో పూడ్చుకున్నాం. బడ్జెట్‌ అంచనా మేరకు ఖర్చు చేసుకోగలుగుతున్నాం. దేశం మొత్తం ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రం రెండంకెల వృద్ధి రేటును సాధించింది. రాష్ట్ర అభివృద్ధికి, ప్రభుత్వం ముందుచూపుతో తీసుకున్న చర్యల వల్ల మాత్రమే సాధ్యమైంది. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా సంక్షేమ రంగానికి ఎక్కువ నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. 


logo