శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Sep 30, 2020 , 15:20:52

ఓడ్ కులస్తులకు మొదటి కుల ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి

ఓడ్ కులస్తులకు మొదటి కుల ధ్రువీకరణ పత్రం అందజేసిన మంత్రి

నిర్మల్ : తెలంగాణ ప్రభుత్వం కొత్తగా బీసీ -ఏ జాబితాలో చేర్చిన ఓడ్ కులస్తులకు మొదటి కుల ధ్రువీకరణ పత్రాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా పవర్ నిహారిక కు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి స్వాతంత్య్ర ఫలాలు అందని అట్టడుగు స్థాయిలో ఉన్న సంచార కులాలను గుర్తించి బీసీ- ఏ జాబితాలో తెలంగాణ ప్రభుత్వం చేర్చడంతో నిజమైన సామాజిక న్యాయం అందించినట్లైందని పేర్కొన్నారు.

ఓడ్ కులంతో పాటు మరో 12 సంచార కులాలను బీసీ - ఏ జాబితాలో మరో నాలుగు కులాలను బీసీ-డీ జాబితాలో చేర్చామన్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఓడ్ కుల ప్రతినిధులు గుర్తింపు కోసం చేసిన ప్రయత్నాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఓడ్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవర్ కైలాష్, సంఘ గౌరవ అధ్యక్షుడు రామ్ కిషన్ మహారాజ్, సంతోష్, మాధవ్, సంజీవ్, తిరుపతి, విజయ్ తదితరులు పాల్గొన్నారు.