ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 12, 2020 , 12:15:07

పేదరిక నిర్మూలనే సెర్ప్ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

పేదరిక నిర్మూలనే సెర్ప్ లక్ష్యం : మంత్రి ఎర్రబెల్లి

వరంగల్ రూరల్ : పేదరిక నిర్మూలనే సెర్ప్ లక్ష్యమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేటలో రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో 64 లక్షల రూపాయలతో మహిళా రైతులకి వ్యవసాయ సంబంధ పరికరాలను మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) తన మొదటి రైతు ఉపకరణాల అద్దె కేంద్రాన్ని చెన్నారావుపేటలో ప్రారంభించినట్లు చెప్పారు.

ఈ పరికరాలను మహిళా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు తమ సొంత కాళ్లపై నిలబడి అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ హరిత, సెర్ప్ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కి మహిళలు కోలాటాలు, నృత్యాలతో తిలకం దిద్ది ఘనంగా స్వాగతం పలికారు.  logo