శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Telangana - Aug 27, 2020 , 12:24:28

మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి

మున్సిపల్ సిబ్బందికి నిత్యావసర సరుకులు అందజేసిన మంత్రి

సూర్యాపేట : సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి నిత్యావసర సరుకులు అందజేశారు. మున్సిపల్ నిధుల నుంచి సుమారు రూ. 15 లక్షల నిత్యావసర వస్తువులు ( కొబ్బరి నూనె, సబ్బులు,చెప్పులు రేయిన్ కోట్) లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్  పెరుమాళ్ల అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ , వైస్ చైర్మన్ పుట్ట కిషోర్, భిక్షం, మున్సిపల్ కమిషనర్ మంజులా రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్  పాల్గొన్నారు. 


logo