శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:14:33

తెలంగాణకు పెరిగిన వలసలు

తెలంగాణకు పెరిగిన వలసలు

గజ్వేల్‌: ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల ప్రజలు ఉపాధి కోసం ఇతర రాష్ర్టాలకు వలసలు వెళ్తే.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాత ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా తదితర రాష్ర్టాల నుంచి కార్మికులు పెద్ద సంఖ్యలో తెలంగాణకు వస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి టీ హరీశ్‌రావు తెలిపారు. ఉపాధి సృష్టించడంలో మనం సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా గౌరారంలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కృత్రిమ గర్భధారణ పశు వైద్యశిబిరాన్ని ప్రారంభించారు.  కొండపోచమ్మ సాగర్‌లో విత్తన చేపపిల్లలను వదిలారు. గజ్వేల్‌లో టీఎన్జీవో భవనానికి శంకుస్థాపన చేశారు. హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది రూ.300 కోట్లను విడుదల చేశామన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడు తూ.. రాష్ట్రంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయన్నా రు. ఆయా కార్యక్రమాల్లో జెడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, ఎఫ్‌డీసీ చైర్మన్‌ ప్రతాప్‌రెడ్డి, టీఎన్జీవో నేతలు కారం రవీందర్‌రెడ్డి, రా జేందర్‌, బేవరేజస్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ పాల్గొన్నారు.logo