శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 14:54:25

సుడా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల

సుడా కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి గంగుల

కరీంనగర్‌ : కరీంనగర్ జడ్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) కార్యాలయాన్ని శుక్రవారం బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సుడా పరిధిలోకి వచ్చే అన్ని గ్రామ పంచాయతీల్లో  ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. పంచాయతీల్లో రోడ్ల విస్తరణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. 

అన్ని పంచాయతీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. సుడా తన పరిధిలోని ప్రతి పల్లెల్లో పట్టణ సౌకర్యాలు అందించేందుకు కృషి చేస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జెడ్పీచైర్ పర్సన్ విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, ఎమ్మెల్యే సతీష్ కుమార్, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణా రావు, కలెక్టర్ కే శశాంక, నగర మేయర్ వై సునీల్ రావుతోపాటు పలువురు  కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

రోహిత్‌, గిల్‌ల‌ను రెచ్చ‌గొట్టిన ల‌బుషేన్‌‌.. వీడియో

క్యాపిట‌ల్ హిల్ అటాక్‌.. సూప‌ర్ స్ప్రెడింగ్ ఈవెంట్ !

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై


logo