ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 29, 2020 , 16:56:25

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాలి : మ‌ంత్రి గంగుల‌

ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాలి : మ‌ంత్రి గంగుల‌

హైద‌రాబాద్ : వ‌రి ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాల‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. పౌర‌స‌ర‌ఫ‌రాల క‌మీష‌న్ కార్యాల‌యంలో రైస్ మిల్ల‌ర్ల అసోసియేష‌న్ ప్ర‌తినిధుల‌తో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్‌, పౌర‌స‌ర‌ఫ‌రాల సంస్థ చైర్మ‌న్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స‌మావేశ‌మ‌య్యారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. వ‌రి ధాన్యం కొనుగోలు స‌జావుగా సాగేలా చూడాల‌న్నారు. రైతుల‌కు మిల్ల‌ర్లు స‌హ‌క‌రించాల‌ని కోరారు. రాష్ర్ట వ్యాప్తంగా 6764 కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 1,071 కొనుగోలు కేంద్రాల ద్వారా 16,702 ట‌న్నుల వ‌రి ధాన్యాన్ని కొనుగోలు చేశామ‌ని తెలిపారు. ఈ ధాన్యం విలువ రూ. 3.15 కోట్లు అని చెప్పారు. వ‌రి ధాన్య‌మును రైస్ మిల్ల‌ర్లు దిగుమ‌తి చేసుకునే విష‌యంలో రైతుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌న్నారు. రైస్ మిల్ల‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వం ప‌రిష్క‌రిస్తుంద‌ని, వారి స‌మ‌స్య‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స్ప‌ష్టం చేశారు.