శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 08, 2020 , 12:11:35

పీవీ నాకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించారు : మ‌ంత్రి గంగుల‌

 పీవీ నాకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించారు : మ‌ంత్రి గంగుల‌

హైద‌రాబాద్ : మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావుకు భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్ర‌వేశ‌పెట్టిన తీర్మానాన్ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ బ‌ల‌ప‌రిచారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. పీవీతో త‌న‌కు చాలా అనుబంధం ఉంది. తాను ఇంజినీరింగ్ చ‌దివేట‌ప్పుడు 1984లో ఆయ‌న ఎంపీగా ఉన్నారు. త‌న‌కు ఇంజినీరింగ్ సీటు ఇవ్వాల‌ని ఓ ఇంజినీరింగ్ కాలేజీకి పీవీ ఓ చిటీ మీద రాసిచ్చారు. అయితే డ‌బ్బులు క‌ట్టాల‌ని కాలేజీ వారు చెప్ప‌డంతో మ‌ళ్లీ పీవీ వ‌ద్ద‌కు వెళ్లాము. ఆ సందర్భంలో పీవీ ఓ మాట అన్నారు. వెనుక‌బ‌డిన కులాల బిడ్డ‌లు డ‌బ్బులు క‌ట్ట‌లేరు అని పీవీ అన్నార‌ని మంత్రి గుర్తు చేశారు. ఒక్క రూపాయి కూడా డ‌బ్బు లేకుండా సీటు ఇప్పించారు. అలా పీవీ వ‌ల్ల‌ త‌న ఇంజినీరింగ్ విద్య పూర్త‌యింది. పీవీ ప్ర‌ధాని అయ్యాక ఆయ‌న‌ను క‌లిశాను. తెలంగాణ బిడ్డ అయిన పీవీకి గౌర‌వం ద‌క్కాల‌నే ఉద్దేశంతో శత జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏడాది పాటు నిర్వ‌హించాల‌ని సీఎం నిర్ణ‌యించారు. ఈ ప‌రిణామం సంతోషించ‌ద‌గ్గ విష‌య‌మ‌ని మంత్రి అన్నారు. సాగునీటి రంగంలో పీవీ క‌న్న క‌ల‌ల‌ను సీఎం కేసీఆర్ నిజం చేస్తున్నారు. క‌రీంన‌గ‌ర్ - వ‌రంగ‌ల్ ర‌హ‌దారికి పీవీ న‌ర‌సింహారావు పేరు పెట్టాల‌ని సీఎం కేసీఆర్‌కు విజ్ఞ‌ప్తి మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. 


logo