శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 11, 2020 , 11:12:43

ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం కింద 1133 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం కింద 1133 మంది విద్యార్థుల‌కు ల‌బ్ధి

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ర్ట ప్ర‌భుత్వం వెనుక‌బ‌డిన కులాల‌కు ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్‌ ప‌థ‌కం చేప‌ట్టింద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు. ఈ ప‌థ‌కంపై శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. 2016-17 నుంచి 2019-20 వ‌ర‌కు ఈ ప‌థ‌కం కింద 1133 మంది బీసీ, ఈబీసీ విద్యార్థులు ల‌బ్ధి పొందార‌ని చెప్పారు. 2016-17లో 190 మంది విద్యార్థులు, 2017-18లో 443, 2018-19లో 321, 2019-20లో 170 మంది విద్యార్థుల‌కు ఓవ‌ర్సీస్ స్కాల‌ర్‌షిప్ ప‌థ‌కం కింద ల‌బ్ధి చేకూరింద‌ని తెలిపారు. వీరంద‌రికి రూ. 184 కోట్ల 70 ల‌క్ష‌ల‌ను కేటాయించి వారి ఖాతాల్లో జ‌మ చేశామ‌ని మంత్రి తెలిపారు. ప్ర‌తి విద్యార్థికి రూ. 20 ల‌క్ష‌ల చొప్పున కేటాయించామ‌ని చెప్పారు. ఈ ప‌థ‌కం ద్వారా నిరుపేద వ‌ర్గాల్లోని బిడ్డ‌లు విదేశాల్లో ఉన్న‌త విద్య‌ను అభ్యసించేందుకు అవ‌కాశం వ‌చ్చింద‌న్నారు. ఈ ప‌థకానికి చాలా డిమాండ్ ఉంద‌ని మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ తెలిపారు.  


logo