మంగళవారం 04 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 01:30:22

వెదురుగట్ట వనానికి కేసీఆర్‌ పేరు

వెదురుగట్ట వనానికి కేసీఆర్‌ పేరు

  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: నీళ్లతోపాటు పచ్చని చెట్లంటే ఇష్టపడే ముఖ్య మంత్రి కే చంద్రశేఖర్‌రావు పేరుతో కరీంనగర్‌ జిల్లా చొప్పదండి మండలం వెదురుగట్టలో ఒక ప్రత్యేక వనాన్ని నిర్మిస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించా రు. గురువారం కరీంనగర్‌ కలెక్టరేట్‌లో హరితహారం, రైతువేదికలు, రైతు కల్లాల నిర్మాణాల పురోగతిపై ఎమ్మెల్యేలు, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అడవుల పెంపకంలో జిల్లా వెనుకబడి ఉందని, వాటి విస్తీర్ణం పెంచాలని చెప్పారు. వెదురుగట్టలో పెద్ద ఎత్తున అడవిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సూచన మేరకు ఆ వనానికి సీఎం కేసీఆర్‌ వనంగా పేరు పెట్టాలని తీర్మానించారు. గంగాధర మండలం కురిక్యాల బొమ్మలగుట్టను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.logo