బుధవారం 08 జూలై 2020
Telangana - Jun 10, 2020 , 01:46:12

శరవేగంగా కరీంనగర్‌ అభివృద్ధి

శరవేగంగా కరీంనగర్‌ అభివృద్ధి

  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌ నగరపాలకసంస్థ పరిధిలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని  బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టంచేశారు. మంగళవారం కరీంనగర్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. కరీంనగర్‌పై ప్రేమతో సీఎంకేసీఆర్‌ ప్రత్యేకచొరవ తీసుకొని స్మార్ట్‌సిటీ హోదా ఇప్పించిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధిని అడ్డుకోవాలన్న ప్రయత్నంలో కొందరు తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌ ఆమరణ దీక్షకు బయలుదేరి అరస్టైన ప్రాంతం అల్గునూర్‌ చౌరస్తాను పవిత్ర స్థలంగా భావించి అద్భుతంగా కేసీఆర్‌ ఐలాండ్‌గా సుందరీకరిస్తామని వెల్లడించారు. 


logo