శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 03:50:00

గోనె సంచులు తిరిగివ్వాలి

గోనె సంచులు తిరిగివ్వాలి

 రేషన్‌డీలర్లు, రైస్‌ మిల్లర్లతో మంత్రి గంగుల

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ సీజన్‌లో ధాన్యం ఉత్పత్తి రెట్టింపు అయ్యే అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలుకు భారీసంఖ్యలో గోనె సంచులు అవసరమవుతాయని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. అందువల్ల రేషన్‌ డీలర్లు తమ వద్ద ఉన్న ప్రతిబ్యాగును ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు. ధాన్యం కొనుగోలు చర్యలపై మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి రేషన్‌ డీలర్లు, రైస్‌ మిల్లర్లతో వేర్వేరుగా సమీక్షించారు. ఈ సీజన్‌లో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనాలని లక్ష్యం పెట్టుకున్నట్టు మంత్రి తెలిపారు. ఇందుకోసం 10 కోట్ల కొత్త గన్నీసంచులు, 9 కోట్ల పాత గన్నీ సంచులు అవసరమన్నారు. సమీక్షలో కమిషనర్‌ వీ అనిల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo