శనివారం 06 జూన్ 2020
Telangana - May 04, 2020 , 00:52:20

ధాన్యం సేకరణపై అవగాహన తెచ్చుకో

ధాన్యం సేకరణపై అవగాహన తెచ్చుకో

  • బీజేపీ నేతకు మంత్రి గంగుల హితవు

కరీంనగర్‌ టవర్‌సర్కిల్‌: ఏ రాష్ట్రం కొనుగోలు చేయనట్టు తెలంగాణలో లాక్‌డౌన్‌లోనూ కేవలం 20 రోజుల్లోనే సుమారు 21 లక్షల టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరించినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌ బోర్డుకాలనీలో 50 మంది వలస కూలీలకు ఆదివారం మేయర్‌ సునీల్‌రావుతో కలిసి సరుకులు పంపిణీ చేశారు. ధాన్యం సేకరణపై బీజేపీ ఎంపీ బండి సంజయ్‌కు అవగాహనలేదని, ఆరోపణలు చేసేముందు వాస్తవాలు తెలుసుకోవాలని మంత్రి హితవుపలికారు. కాంగ్రెస్‌ నాయకులు తాలు పేరిట సొల్లు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణగౌడ్‌ పాల్గొన్నారు. 


logo