శనివారం 04 జూలై 2020
Telangana - Apr 24, 2020 , 14:12:25

రాజకీయలు కాదు హమాలీలు.. గన్నీ సంచులు తెప్పించు..

రాజకీయలు కాదు హమాలీలు.. గన్నీ సంచులు తెప్పించు..

కరీంనగర్:  రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించారు.  ధాన్యం కొనుగోళ్లపై రాజకీయం చేయవద్దని హితవ పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ధాన్యం కొనుగోళ్లపై అవగాహన లేదని పేర్కొన్నారు.  కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ఇండియాలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తోందని తేల్చి చెప్పారు. రైతులు పంట పండించే ముందు ఎదురైన ఇబ్బందులను సంజయ్ ఎందుకు పట్టించు కోలేదని ప్రశ్నించారు. ఇపుడు హమాలీల కొరత ఉంది. బీహార్ సీఎంతో మాట్లాడి అక్కడి హమాలీలను రప్పించు. గన్నీ బ్యాగుల కొరత ఉంది రాంవిలాస్ పాశ్వాన్ ఆఫీసు ముందు ధర్నా చేసి తెప్పించు. ఇలాంటి ఇబ్బందులు పట్టించుకోకుండా.. కేవలం తరుగు మీదనే రాజకీయం చేయటం ఏమిటని ప్రశ్నించారు.

ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం క్వింటాలు ధాన్యం ఇస్తే 68 కిలోల బియ్యం ఇవ్వం మిల్లర్లు ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎఫ్ సీఐ కార్యాలయం ముందు దీక్ష చేసి ఎఫ్ఏక్యూ నిబంధనలు మార్పించు.. క్వింటాలు ధాన్యం ఇస్తే 60 - 50 కిలోల బియ్యం ఇచ్చేలా చేయి..  అపుడు రైతులు మెచ్చుకుంటరు.. మిల్లర్లు సంతోష పడుతరు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎందుకు కొనుగోళ్లు జరపడం లేదని అడిగారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నా సీఎం కేసీఆర్ రైతులు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మాట మీద నిలబడి కొనుగోళ్లు పూర్తి చేస్తాం. అవగాహన లేకుండా రైతుల మనోధ్యైర్యం దెబ్బతినేలా వ్యవహరించడం సంజయ్‌కి మంచిది  కాదని హితవు పలికారు.


logo