గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 02:35:59

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు

  • బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌ కార్పొరేషన్‌: కరీంనగర్‌లో ప్రతి ఇంటికీ యజమానులు కోరుకున్న ఆరు మొక్కలను అందిస్తామని, వాటిని ఇంటి పరిసరాల్లోనే నాటి సంరక్షించాలని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ కోరారు. హరితహారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌ 40వ డివిజన్‌లోని మెహర్‌నగర్‌లో ఇంటింటికీ పూలు, పండ్ల మొక్కలను మేయర్‌ సునీల్‌రావుతో కలిసి పంపిణీ చేశారు. అనంతరం శాతవాహన యూనివర్సిటీలోని బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాలమేరకు ఈ సారి జిల్లాలో 50 లక్షల మొక్కల లక్ష్యంగా ముందుకుసాగుతున్నామని, కరీంనగర్‌లో 12 లక్షల మొక్కలు నాటుతామని స్పష్టంచేశారు.


logo