గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 01:16:18

సాగులో విప్లవాత్మక మార్పులు

సాగులో విప్లవాత్మక మార్పులు

  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చారని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. శుక్రవారం కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం కమాన్‌పూర్‌లో రైతు వేదిక నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత కరెంట్‌తోపాటు పెట్టుబడి కోసం ఏడాదికి ఎకరాకు రూ. 10 వేలు, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇస్తున్నారని తెలిపారు. కనీస మద్దతు ధర చెల్లించి 64 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు రైతులు నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. అనంతరం రూ.కోటి వ్యయంతో కొనుగోలు చేసిన 300 సీసీ కెమెరాలు, ఇతర సామాగ్రిని కరీంనగర్‌ పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డికి మంత్రి అందజేశారు.logo