గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 00:47:36

ఆపదకాలంలో ఆదుకుంటాం

ఆపదకాలంలో ఆదుకుంటాం

  • టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు మంత్రి గంగుల భరోసా

కరీంనగర్‌ కార్పొరేషన్‌: ఆపదకాలంలో కార్యకర్తలకు టీఆర్‌ఎస్‌ అండగా నిలుస్తుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో 3 వేల మంది కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీచేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి బలమన్నారు. 3 వేల మందికి  ఒక్కొక్కరికి 15 కిలోల సన్నబియ్యం, రూ.550 విలువైన నిత్యావసరాలను అందించామని చెప్పారు. సీఎం కేసీఆర్‌ నిర్ణయాలను అమలుచేయడం వల్లే కరీంనగర్‌ ఆరెంజ్‌జోన్‌ నుంచి గ్రీన్‌ జోన్‌గా మారుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్‌ సునీల్‌రావు తదితరులు పాల్గొన్నారు. logo