మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 08, 2020 , 18:41:24

రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

రైతు వేదికల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన

పెద్దపల్లి: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ బుధవారం పెద్దపల్లి జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. ధర్మారం, కటికెనపల్లి గ్రామాల్లో రూ.22 లక్షలతో నిర్మిస్తున్న రైతు వేదికకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధర్మారం బస్ స్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

అనంతరం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం శకల్లా గ్రామంలోని రూ. 53.3 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, ఐకేపీ భవనం, రైతు వేదిక, గంగపుత్ర సంఘ భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని అన్నారు. ముఖ్యంగా రైతాంగాన్ని అన్ని విధాల ఆదుకునేందుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తుందని గుర్తుచేశారు. 


logo